

లోకమాత అహల్య బాయి హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా సమన్వయ సమితి సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జగదాంబ సెంటర్ రెండవ నెంబర్ బస్తి 8వ వార్డులో ఉన్న శ్రీ రామాలయం లో మహిళలతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం విభాగ్ సంయోజిక జ్యోతిర్మయి అహల్య బాయి హోల్కర్ గారి జీవితం లో ఆమె ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని తన రాజ్యంలోని ప్రజలను కన్నతల్లిలా ఆదరిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ధర్మరక్షణలో కాశి, సోమనాథ్ ఇలా ఎన్నో దేవాలయాలను పునరుద్ధరణ( జీర్ణోద్ధరణ) చేశారని ఎంతోమంది స్త్రీలకు ఆదర్శంగా నిలిచారని వారిని చూసి ప్రతి మహిళ కుటుంబంతో పాటు ధర్మ రక్షణకు కూడా పని చేయవలసిన అవసరం ఉంది అని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంయోజిక మేడూరి సూర్యకుమారి, సహా సంయోజిక పిల్లి ప్రసూన రాణి, విజయలక్ష్మి విజయ సరిత సౌజన్య అనేక మంది మహిళలు పాల్గొన్నారు..