మూడు జూలై నుండి 9 జులై తేదీ వరకు ఏడు రోజులపాటు జరిగిన ఆన్లైన్ యోగ వాలంటీర్ సర్టిఫికెట్ కోర్సును స్థానిక సంఘసంస్కర్త యోగా నిపుణులు గాయత్రీ పరివార్ యుగ్ నిర్మాణ్ మిషన్ జిల్లా సమన్వయకర్త సతీష్ ఖండేల్వాల్ పాల్గొని యోగ వాలంటరీ కోర్సును పూర్తి చేశారు ఆన్లైన్ యోగ వాలంటీర్ కోర్స్ భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రత్వ శాఖ ద్వారా పరమానంద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగ సైన్స్ మరియు రీసెర్చ్ సెంటర్ ఇండోర్ మధ్యప్రదేశ్ కు చెందిన వారు నిర్వహించగా ఇందులో ఆయన పాల్గొని సూక్ష్మ వ్యాయామములు నిలబడి కూర్చొని పడుకొని చేసే వివిధ ఆసనాలతో పాటు ప్రాణాయామం నిత్యజీవితంలో ఉపయోగపడే ఆసనాలపై శిక్షణ పొంది సర్టిఫికెట్ ఆన్లైన్లో అందుకున్నారన్నారు ఈ సందర్భముగా సతీష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ యోగా కోర్సు పొందిన విషయాన్ని తెలుసుకున్న ఉమ్మిడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ అధికారులు మీరు మా అందరికీ స్ఫూర్తి, గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఫిట్నెస్, మీ యాక్టివిటీ చాలా బాగున్నాయి అని వివిధ రకాలుగా వివరించి వర్ణించి అభినందించారన్నారు ఆన్లైన్ యోగా సర్టిఫికెట్ కోర్సు కు ఎటువంటి విద్య గాని వయసుకు పరిమితం లేకుండా శిక్షణ పొంది వివిధ విద్యాలయాలలో ఉద్యోగ శిక్షకులుగా ఉపాధి పొందవచ్చని వివరిస్తూ జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యము జ్ఞాపకశక్తి పెంచేందుకు యోగాసనాలు ఉచిత శిక్షణ ఇస్తానన్నారు ఇందు కోసం జిల్లా విద్యాశాఖ అధికారి తమ పరిధిలో గల పాఠశాలలకు సమాచారం అందించాలని సతీష్ ఖండేల్వాల్ కోరారు.
Post Visitors:40
Related Stories
September 9, 2024