

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదేశాల మేరకు పారా లీగల్ వాలంటీర్ సతీష్ ఖండేల్వాల్ నిర్వహణలో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో “ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని” పురస్కరించుకొని ఉచిత ఆరోగ్య న్యాయ సహాయ సిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పి ఎల్ వి సతీష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు చేవిస్తే ఆరోగ్యం ప్రమాదాలకు గురవుతుందని ప్రజా ఆరోగ్యం పట్ల అందుబాటులో ఉన్న ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య మిత్ర, ఎన్ సి డి నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచిత ఆరోగ్య సేవా పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పథకాలలో అన్యాయం జరిగినట్లు భావిస్తే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకు ఆశ్రమించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు అన్నారు హాజరైన వారికి చట్టాలు ప్రభుత్వ పథకాలపై అవగాహన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ జూనియర్ అసిస్టెంట్, వెంకట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆర్మీల సీనియర్ స్టాఫ్ నర్స్, సెక్యూరిటీ గార్డ్ శ్రీను హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోగులను పరామర్శించి హాస్పటల్ సేవలు ఎలా ఉంది అడగగా బాగుందని వారు తెలిపారు.