.

గో సేవా విభాగం తెలంగాణ హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి గోవు పర్యావరణ పరిరక్షణ శాస్త్రీయ విజ్ఞాన పరీక్షలు ఇల్లందు పరిధిలో గో సేవా విభాగం తెలంగాణ జిల్లా బాధ్యులు స్వామి నాయుడు సూచన మేరకు ఇల్లందు పరిధిలో పరీక్ష నిర్వాహకులు పర్యావరణ వేత్త తెలంగాణ ప్రభుత్వం జంతు సంక్షేమ బోర్డు మాజీ సభ్యుడు గాయత్రి పరివార్ డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ పర్యవేక్షణలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జేబీఎస్ హైస్కూల్, మెయిన్ రోడ్ ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఉన్నత పాఠశాల ఓల్డ్, జిల్లా పరిషత్ హై స్కూల్ సుభాష్ నగర్, గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల సుదిమల్ల, మాస్టర్ మైండ్స్ హై స్కూల్ సుభాష్ నగర్, శ్రీ సరస్వతి విద్యాలయం సుభాష్ నగర్ 9 పరీక్ష కేంద్రాలలో 49 మంది విద్యార్థులు మూడో లెవెల్ రాష్ట్రస్థాయిలో పాల్గొనుటకు అర్హత పొందారని వారికి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల సుద్ధిమల్ల లో రాష్ట్రస్థాయి పాల్గొనుటకు నియమ నిబంధనలతో పాటు జ్ఞాపికలను బహుకరించారు. పరీక్ష నిర్వహికులు డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ తెలిపారు ఇందులో నెగ్గిన వారు రాష్ట్రస్థాయి పరీక్షలో పాల్గొన్నటకు ఈ నెల 15న స్వర్ణ భారతి హై స్కూల్ రామవరం కొత్తగూడెం లో పాల్గొన వలసి ఉంటుందని రాష్ట్రస్థాయి విజేతలకు ప్రశంసాపత్రాలు అవార్డుల తో పాటు మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి యాబై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై ఐదువేల రూపాయలు హైదరాబాదులో అందజేస్తారని డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ తెలిపారు . ఈ కార్యక్రమంలో స్వామి నాయుడు గ్రావిటీ స్కూల్ టేకులపల్లి డైరెక్టర్ పునియా నాయక్ శ్రీమతులు శిరీష హిందీ ఉపాధ్యాయ కురాలు నాగేశ్వరిజీ, భానోత్ గంగ, యాని ఎయేల్య, సర్వేశ్వరరావు, ఎండి అబ్దుల్ నయీమ్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


