పర్యావరణ పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత ఎంతగానో అత్యవసరమని స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గాయత్రీ పరివార్ యుగ్ నిర్మాణ్ మిషన్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ అన్నారు ఇల్లందు పట్టణంలోని ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ ఏకల అభియాన్ పాఠశాలల జిల్లా కార్యాలయంలో బ్లాక్ బోర్డ్స్ వితరణ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవా పోస్టర్లను ఇల్లందు టేకులపల్లి గుండాల 18 గ్రామా పంచాయితీలో గల ఏకల్ అభియాన్ పాఠశాలల ఆచార్యులకు అందజేసి విద్యార్థులచే ప్రజలచే గ్రామపంచాయతీ అధికారులతో కలిసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించాలని ప్రతిజ్ఞ చేయించి వివరించారు ఈ కార్యక్రమములో కార్యాలయ ప్రముఖ్ దేవ్ సింగ్ పూర్తి సమయ కార్యకర్తలు శిక్ష ప్రశిక్షణా ప్రముఖ్ రాజేశ్వరి సంచ్ కార్యకర్తలు ప్రమీల సుశీల రామయ్య ఆంచల్ సమితి సభ్యులు అప్పలరాజు వాసుదేవరావు పాల్గొన్నారు.



